ఎజెండా లేని సమావేశాలెందుకు ?

30
- Advertisement -

నేటి నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా సంగతి తెలిసిందే. అయితే అర్ధాంతరంగా ఈ సమావేశాలకు కేంద్రం ఎందుకు నిర్వహిస్తోంది. ఇంతకీ ఈ సమావేశాల వెనుక ఉన్న ఎజెండా ఏంటి ? ఈ సమావేశాల వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ? అనే ప్రశ్నలు ప్రతి సామాన్యుడి మదిలో మెదులుతున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా పై విషయాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు కారణం ఏంటి అని ప్రశించిన బి‌ఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుడు కేశవరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పెద్దలు సమాధానం చెప్పకుండా దాటవేశారట. .

దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల విషయంలో కేంద్రం ఏదో దస్తోందని అనుమానాలను వ్యక్తం చేశారాయన. నిజానికి ఈ అనుమానం కేశవరావు ఒక్కడిదే కాదు.. దేశ ప్రజల్లోనూ ఉంది. అనూహ్యంగా పార్లమెంట్ సమావేశాలను మోడి సర్కార్ ఎందుకు నిర్వహిస్తోందని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల తరువాత మళ్ళీ శీతాకాల సమావేశాలు ఉంటాయా ? అనే దానిపై కూడా క్లారిటీ లేదు. అయితే ఈ సమావేశాల్లో జమిలి ఎలక్షన్స్ పై బిల్లు మరియు దేశ పేరు మార్పుపై మరో బిల్లు ప్రవేశ పెట్టేందుకే ఈ ప్రత్యేక సమావేశాలని గత కొన్నాళ్లుగా వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమే అనేది మరికొందరి వాదన. మరి వివాదాస్పదంగా మారిన ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ఏం చేయబోతుందో చూడాలి.

Also Read:పవన్ డైరెక్షన్ లో టీడీపీ ?

- Advertisement -