31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు…

60
parliament

ఈ నెఉల 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది.

జనవరి 31న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు.