తండ్రి గురించి అబద్దం చెప్పి అడ్డంగా బుక్కైన నోయల్!

136
noel

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఆరు వారాలు పూర్తిచేసుకుంది. ఆరో వారంలో ఇంటి నుండి కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరోవారంలో ఇంటి సభ్యుల చిన్ననాటి, ఫ్యామిలీ ఫోటోలను స్క్రీన్‌పై చూపిస్తూ సభ్యులను ఎమోషన్ చేసిన బిగ్ బాస్ తమ చిన్ననాటి జ్ఞాపకాలను చెప్పాలని కోరారు.

మెజార్టీ కంటెస్టెంట్లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుండి వచ్చామని, ఎన్నోక‌ష్టాలు పడి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చామని తెలపగా ఈ క్రమంలో సింగ‌ర్ నోయ‌ల్ త‌న కుటుంబం గురించి చెప్తూ ఎమోషన్ అయ్యాడు. మా అమ్మ అంద‌రి ఇళ్ల‌ల్లో ప‌ని చేసేది…. నాన్న ఇస్త్రీ, మేస్త్రీ ప‌ని చేస్తూ డ‌బ్బులు సంపాదించేవాడు అని చెప్పాడు.

ప్రేక్షకుల సానుభూతి కొట్టేయాలనో లేదా ఏ ఉద్దేశంతో నోయల్ చెప్పాడో కానీ ఇప్పుడు అందరికి టార్గెట్ అయ్యాడు. వికీపీడియాలో అత‌డి తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని ఉంది. తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అయినా కూడా రోజువారీ కూలీ అన్న‌ట్లుగా చెప్పి సింప‌తీ ఓట్లు పొందాల‌ని చూస్తున్నాడ‌ని విమ‌ర్శిస్తున్నారు.