టీచర్‌ ట్వీట్ …స్పందించిన మంత్రి కేటీఆర్

67
ktr

భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. ముఖ్యంగా భారీ వర్షాల నుండి కోలుకునే లోపే మళ్లీ వర్షం ముంచెత్తడంతో నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల ఇళ్లు నీట మునగగా పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.

అయితే భారీ వర్షాలకు అడిక్‌మెట్‌ డివిజన్‌ లలితానగర్‌లో డ్రైనేజీ ఓవర్‌ ఫ్లో అవుతోంది. వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఈ సమస్యపై మంత్రి కేటీఆర్‌కు ఆయన హైస్కూల్‌ గురువు, లలితానగర్‌ అడిక్‌మెట్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ.

తన గురువు చేసిన అభ్యర్థనపై వెంటనే స్పందించిన కేటీఆర్‌ ఆ సమస్యను పరిష్కరించాలని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే గోపాల్‌కు సూచించారు. ఆయన అధికారులతో కలిసి వెళ్లి సమస్యను పరిష్కరించారు.