నిఖిల్ @ 10 ఇయ‌ర్స్

250
Nikhil Successfully Completes 10 Years In Industry
- Advertisement -

2007 లో హ్యాపీ డేస్ తో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంట్రీ ఇచ్చిన న‌టుడు నిఖిల్. గాఢ్ ఫాదర్‌ లేకుండానే ఇండస్ట్రిలోకి ఎంట్రి ఇచ్చిన నిఖిల్ సక్సెస్‌ ఫుల్‌గా తన పదేళ్ల కెరీర్‌ని పూర్తిచేసుకున్నాడు. ఇండస్ట్రీ లో హీరోగా రాణించాలంటే చాల కష్టం..సక్సెస్ వచ్చినప్పుడు అందరూ తన వెంట ఉంటారు..అదే ప్లాప్ అయితే మాత్రం తన పక్కన రావడానికి కూడా ఆలోచిస్తుంటారు.. ఇక సొంత టాలెంట్ తో వచ్చేవారు మాత్రం చాల జాగ్రత్తగా సినిమాలు చేయాలి లేకపోతే వారి పరిస్థితి అంతే. కానీ నిఖిల్ పరిస్ధితి ఇందుకు భిన్నం. సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన నిఖిల్ పదేళ్లు పూర్తి చేసుకున్న సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ ప‌దేళ్ల‌లో హ్యాపీడేస్ తో పాటు అంకిత, ప‌ల్ల‌వి అండ్ ఫ్రెండ్స్,యువ‌త‌, క‌ళావ‌ర్ కింగ్, ఓం శాంతి,అమృతం, వీడు తేడా, డిస్కో, స్వామి రారా, కార్తీకేయ‌, సూర్య వ‌ర్స‌స్ సూర్య‌, శంక‌రాభ‌ర‌ణం, ఎక్క‌డికీ పోతావ్ చిన్న‌వాడ‌, కేశ‌వ మూవీల్లో న‌టించాడు..2013 లో విడుద‌లైన స్వామి రారా మూవీ నుంచి నిఖిల్ న‌టించిన ఆరు మూవీలో వ‌రుస‌గా హిట్స్ సాధించాయి. ఈ నాలుగేళ్ల‌లో హీరోగా పై మెట్టుకు ఎదిగాడు..విభ‌న్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు శ్రీ‌కారం చుట్టాడు. తాజాగా  కేశ‌వ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని నిఖిల్ మీడియాతో ప‌లు విష‌యాల‌ను పంచుకున్నాడు.

ఎన్నో సినిమాల ఆడిషన్లకు వెళ్లాను. ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టాలో తెలియక సతమతం అవుతున్న రోజుల్లో శేఖర్ కమ్ముల అవకాశం ఇచ్చారు.. ఆయనను ఎప్పటికీ మర్చిపోను. అందుకే నా ఫోన్ లో ఆయన పేరు శేఖర్ సార్ గాడ్ అని సేవ్ చేసుకున్నా’ అంటూ నిఖిల్ శేఖర్ కు ధన్యవాదాలు చెప్పారు.

నిఖిల్ అంటే మినిమమ్ హీరో అనిపించుకున్నాడు..చిన్న నిర్మాతలకు ఓ బంగారు బాతు అయ్యాడు. నిఖిల్ ఇండస్ట్రీ కి పరిచమై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా పలువురు దర్శక , నిర్మాతలు నిఖిల్ ను సత్కరించారు. ద‌ర్శ‌కులు శేఖ‌ర్ క‌మ్ముల‌, సుధీర్ వ‌ర్మ‌, న‌టుడు రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, నిఖిల్ మ‌రిన్ని మంచి చిత్రాల‌లో న‌టించాల‌ని ఆకాంక్షించారు.  విభిన్న‌మైన క‌థా చిత్రాల‌కే ప్రాధాన్య‌త ఇస్తాన‌ని నిఖిల్ పేర్కొన్నాడు. త‌న‌ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులకు హృద‌య‌పూర్వంగా ధ‌న్య‌వాదాలు తెలిపాడు ఈ యువ హీరో.

Nikhil Successfully Completes 10 Years In Industry

- Advertisement -