‘స్వయంభూ’లో జాయిన్ అయిన నభా

14
- Advertisement -

‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభూ’ ప్రస్తుతం దేశంలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. లెజెండరీ యోధుడిగా నటిస్తున్న నిఖిల్ పాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’ నిఖిల్ 20వ చిత్రం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్వయంభూ టాప్-క్లాస్ టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోంది.

ఈ చిత్రంలో సంయుక్త ఒక కథానాయికగా నటిస్తోంది. ఆమె తన పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకుంది. మేకర్స్ ఈరోజు ఒక పెద్ద అప్‌డేట్‌తో వచ్చారు. చేతికి గాయమైన నభా నటేష్ మళ్లీ వర్క్ లో చేరారు. ఈ మాస్టర్‌పీస్‌లో ఒక మహిళా ప్రధాన పాత్రను పోషించడానికి ఆమె బోర్డులోకి వచ్చారు. మేకర్స్ ఆమె లుక్ ని రివిల్ చేశారు. నభా గాయం నుంచి కోలుకుని టీంలో చేరినట్లు వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ పాత్ర కోసం ఆమె ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో, చీరలో నగలతో ఆమె యువరాణిలా కనిపిస్తోంది. నిఖిల్ కూడా వీడియోలో ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ చిత్రంలో నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. అది పోస్టర్‌లో ఆమె గెటప్, లుక్‌లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్.ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ లో నభా నటేష్ కూడా చేరారు.

Also Read:Congress:ఎన్నికల వేళ మరో షాక్..

- Advertisement -