ప్చ్.. ఇలా అయితే ఎలా నిఖిల్?

11
- Advertisement -

హీరోగా కాస్త గుర్తింపు వస్తే చాలు.. కోట్లు అడుగుతారు. ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో ఉన్న విషయమే. అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి విజయ్ దేవరకొండ వరకూ డిమాండ్ చేసినవారే. కాకపోతే, ప్రస్తుతం కొందరు తెలుగు హీరోలు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. అసలు సినిమాలు థియేటర్ దగ్గర ఎలా నడుస్తున్నాయనేది చూసుకోవాలి కదా ?, అలాగే తమ సినిమాలకు నాన్ థియేటర్ హక్కులు చెల్లుబాటు అవుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి కదా ?, ఇవన్నీ తమకు అవసరం అంటే ఎలా ?.

రోజురోజుకు తెలుగు హీరోల రెమ్యూనిరేషన్లు మాత్రం పెరిగిపోతూనే వున్నాయి. హీరో నాని, హీరో రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరోలు చాలా మంది తమ రెమ్యూనిరేషన్లు 12 కోట్లు దాటించేశారు. గతంలో పది కోట్లు దగ్గర ఉన్న బాలకృష్ణ, రవితేజ లాంటి వారు కూడా ఎప్పుడో ఇరవై కోట్ల దగ్గరకు వచ్చేసారు. ఇక సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా 9 కోట్ల లైన్ లో వున్నారు. ఇలాంటి నేపథ్యంలో తనకేం తక్కువ అనుకుంటున్నాడు హీరో నిఖిల్. పైగా తనకు కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ కూడా ఉంది.

అందుకే, ప్రస్తుతం హీరో నిఖిల్ కూడా తన రెమ్యూనిరేషన్ ను కాస్త భారీగానే చెబుతున్నారని తెలుస్తోంది. నిజానికి హీరో నిఖిల్ కెరీర్ పెద్ద గొప్పగా లేదు. ఒక్క కార్తికేయ 2 సినిమాని పక్కన పెడితే.. నిఖిల్ కి హిట్ పడి చాలా కాలం అయింది. ఓ దశలో నిఖిల్ వరుసగా ఫ్లాపులు ఇచ్చాడు. అయినా కొత్త ప్రాజెక్ట్ అంటే 20 నుంచి 25 కోట్ల మధ్యలో రెమ్యూనిరేషన్ ను నిఖిల్ కోట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇలా అయితే ఎలా నిఖిల్ ?!!.

Also Read:BRS:బి‌ఆర్‌ఎస్ ‘వ్యూహం’.. మెజారిటే లక్ష్యం!

- Advertisement -