బాద్‌షాను భయపెట్టిన భారీ ఉడుము !!

233
Shah Rukh Khan loses his cool over a prank
Shah Rukh Khan loses his cool over a prank
- Advertisement -

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ ఎడారిలో ఓ అమ్మాయితో క‌లిసి ఊబిలాంటి బుర‌ద గుంత‌లో కూరుకుపోయి ఉంటాడు. అందులోంచి ఎలా బయటపడాలో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంత‌లో ఓ కొమొడో డ్రాగ‌న్ (భారీ ఉడుము) వాళ్ల‌వైపు వ‌స్తుంటుంది. భ‌యంతో ఆ అమ్మాయి అరుస్తుంటే.. షారుక్ కూడా ఏం చేయాలో తెలియ‌క అటూ ఇటూ చూస్తూ.. లోపల భయం వేస్తున్నా.. పైకి ధైర్యం ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే ఇదంతా సినిమా స్టోరీ కాదు. రియల్ స్టోరీ కూడా కాదు.. దుబాయ్‌లో ఓ షోకి సంబంధించింది. షారుఖ్ పాల్గోన్న ఈ వీడియో వైర‌ల్ అయింది. ఆ వీడియోలో ఉన్నదాని ప్ర‌కారం… ముందు చెప్పిన సీన్ కనిపిస్తుంది. అయితే అది నిజ‌మైన కొమొడో కాద‌ని, ప్రాంక్‌లో భాగంగా ఓ వ్య‌క్తి ఆ వేషం వేసుకొని ఈ చిలిపి ప‌నికి ప్ర‌య‌త్నించాడ‌ని గ్ర‌హించిన షారుక్ సీరియ‌స్ అయ్యాడు. అందులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆ వ్య‌క్తిని కిందేసి కొట్ట‌డానికి షారుక్ ప్ర‌య‌త్నించాడు కూడా.. ఆ వ్యక్తిని తిడుతున్నది ఆ వీడియోలో క‌నిపిస్తుంది. అయితే ఈ ప్రాంక్ షోలో భాగంగా చేశారా లేక నిజంగా షారుక్ తెలియ‌క్ సీరియ‌స్ అయ్యాడా అన్న‌ది తెలియ‌లేదు. మీరు ఓసారి ఈ వీడియో చూడండి…

- Advertisement -