మెగాడాటర్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్!

64
niharika

మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి డిసెంబ‌ర్ 7న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో చైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను వ‌రుణ్ తేజ్ దగ్గరుండి చూసుకుంటుండగా మెగా ఫ్యామిలీ రేంజ్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ వేడుక‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

మ‌రి కొద్ది రోజుల‌లో బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్ బై చెప్ప‌నున్న నిహారిక త‌న ఫ్రెండ్స్ , ఫ్యామిలీస్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆ మ‌ధ్య త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి గోవాలో పార్టీ చేసుకున్న ఈ అమ్మ‌డు తాజాగా త‌న అక్క చెల్లెళ్ళ‌తో క‌లిసి ర‌చ్చ చేసింది.ఇందులో చిరు పెద్ద కూతురు సుష్మిత, చిన్న కూతురు శ్రీజలు కూడా ఉన్నారు. చెల్లి పెళ్లి అనే క్యాప్షన్ పెట్టి నిహారిక షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇక పెళ్లికి రెండు రోజుల ముందే ఉద‌య్ పూర్ వెళ్ళి అక్క‌డ ప‌నుల‌ని ద‌గ్గ‌రుండి చూసుకోనున్నాడ‌ట పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌.