నిహారిక కోరిక ఇప్పుడు అదే

34
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక డివొర్స్‌ పై క్లారిటీ వచ్చింది. తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక విడాకులు తీసుకుంది. మరి ఇప్పుడేం చేయాలి ?, కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలి ? అనే విషయాల్లో నిహారిక ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా మళ్లీ నటిగా ముఖ్యంగా హీరోయిన్ గా బిజీ కావాలి అనేది నిహారిక కోరిక. నిహారిక అచ్చ తెలుగు అమ్మాయి. పైగా మెగా హీరోయిన్. అలాగే ఆమె ఫుల్ పాపులర్. సో.. హీరోయిన్ గా నిహారిక కు చాలా సులభంగా అవకాశాలు వస్తాయి. కాబట్టి, ఈ భామ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది, కాకపోతే హీరోయిన్ గా రాణిస్తోంది అంటే.. చెప్పలేం.

నిహారికకు కుటుంబ సభ్యులు అండగా ఉన్నా… మెగా ఫ్యాన్స్ వైపు నుంచి సపోర్ట్ ఉండదు. తమ అభిమాన హీరో ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.. వేరే హీరోలతో రొమాన్స్ చేసుకుంటూ హద్దులు దాటితే.. ఏ స్టార్ హీరో అభిమానులు ఒప్పుకోరు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు నిహారిక విషయంలోనూ ఇదే జరగొచ్చు. దీనికితోడు తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు రావు. వచ్చినా తెలుగు అమ్మాయిలకు మెయిన్ క్యారెక్టర్స్ ఇవ్వరు. ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే.. రెండు సినిమాలకే అది పనికొస్తోంది.

మరి హీరోయిన్ గా నటిగా లాంగ్ జర్నీని కొనసాగించాలి అంటే.. నిహారిక తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూని పెంచుకోవాలి. అందుకే, తాను మొదట తమిళంలో హీరోయిన్ గా ట్రై చేయాలని నిహారిక నిర్ణయించుకుంది. ఆమె ప్రస్తుతం చెన్నై కి షిఫ్ట్ కావాలని కూడా ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గ్లామర్ రోల్స్ కూడా చేస్తా అని తన కుటుంబ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ కూడా ‘నీ ఇష్టం వచ్చింది చెయ్.. కానీ పద్దతిగా నిజాయితీగా చేయి అని సలహా ఇచ్చాడట. మొత్తమ్మీద అందాల ఆరబోతకు నిహారిక కసరత్తులు మొదలు పెట్టింది.

Also Read:Purandheswari:జనసేన ఎప్పటికీ మిత్రపక్షమే ..

- Advertisement -