పాక్ ఆటగాళ్లను వణికిస్తున్న కరోనా!

71
corona

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ఆటగాళ్లను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే ఆరుగురు క్రికెటర్లు కరోనా బారిన పడగా తాజాగా మరో క్రికెటర్‌కి కరోనా సోకింది. నవంబర్ 23న పాకిస్థాన్ నుంచి న్యూజిలాండ్ బయల్దేరి వెళ్లిన పాక్ జట్టు క్రైస్ట్ చర్చ‌లోని హోటల్లో క్వారంటైన్లో ఉంది.

పాక్ జట్టులోకి ఆటగాళ్లకి కరోనా సోకడం,వారు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో పర్యాటక జట్టు శిక్షణ కోసం హోటల్ నుంచి బయటకు వెళ్లకుండా న్యూజిలాండ్ ఆంక్షలు విధించింది. టెస్టుల్లో నెగటివ్ అని తేలిన వారిని సైతం హోటల్ గదుల నుంచి బయటకు వెళ్లనీయమని న్యూజిలాండ్ తెలిపింది.

న్యూజిలాండ్‌లో క్వారంటైన్లో ఉన్న పాక్ క్రికెటర్లు పదే పదే నిబంధనలు ఉల్లంఘించారు. భోజనాన్ని పంచుకుంటూ.. పక్కన పక్కన కూర్చుంటూ.. మాస్క్‌లు ధరించకుండా రూల్స్‌ను బ్రేక్ చేశారు. దీంతో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన కివీస్ మేనేజ్‌మెంట్ ఇదే చివరి వార్నింగ్ అని స్పష్టం చేసింది.