Niharika:నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు

41
- Advertisement -

నిహారిక త‌న భ‌ర్త‌ చైతన్య జొన్న‌లగ‌డ్డ‌తో అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా నిహారిక కొద్దిసేపటికే తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒకరికి బర్త్ డే విషెస్ చెబుతూ స్టోరీ షేర్ చేసింది. నిహారిక ఎన్ఎం పేరుతో ఉన్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు ఆమె బర్త్ డే విషెస్ తెలిపింది. అనంతరం తన విడాకుల వార్తలపై కూడా ఆమె స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టింది. చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.

ఇలాంటి సమయంలో తనను ఎవరూ ఏ రకంగా ఇబ్బంది పెట్టొద్దని కోరింది. తాను కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో కూడా తాను ప్రైవసీని కోరుకుంటున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయాన్ని అందరూ గౌవవించాలని విజ్ఞప్తి చేసింది. తనకు ఇంత కాలం అండగా నిలిచిన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ, మెగా డాటర్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఓ లైన్ పైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

Also Read:సమంత ప్రేమాయణంపై మరో పుకారు

నిహారిక తన విడాకులపై స్పందించే క్రమంలో.. తాను కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రైవసీని కోరుకుంటున్నా అని రాసుకొచ్చింది. అంటే.. నిహారిక మాటలను బట్టి, ఆమె ఆల్ రెడీ ఎవరితోనే రిలేషన్ లో ఉందని.. ఆ విషయం గురించే నిహారిక ఇలా ఇన్ డైరెక్ట్ గా మాట్లాడింది అని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ఏది ఏమైనా నిహారిక విషయంలో మెగా ఫ్యామిలీ పెద్దగా ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు. నిహారిక ఆమె భ‌ర్త‌ చెత‌న్య జొన్న‌లగ‌డ్డ‌లకు న్యాయ‌స్థానం విడాకులు కూడా మంజూరు చేసింది.

- Advertisement -