మొక్కలునాటిన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్

162
green

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ శర్మన్, అనంతరం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటారు కలెక్టర్ శర్మన్.

అనంతరం మీడియా తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ఒక ఉద్యమం లా చేస్తున్నారు . అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం తో గ్రీన్ ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది . ఇప్పడున్న ఆధునిక యుగంలో ఎన్నో పక్షులు , జంతువులు అంతరించి పోతున్నాయంటే కారణం అడవులు అంతరించి పోవడమేనని తెలిపారు.

ఈ రోజు కోతులు జనావాసం లోకి వస్తున్నాయంటే వాటికి అడవుల్లో ఆహరం లేకపోవడమే . అన్ని రకాల పండ్ల చెట్లని అడవుల్లో పెంచితే భవిష్యత్ లో అన్ని రకాల జతువులు జీవించగలుగుతాయి . ఈ ఉద్యమం ఇలానే కొనసాగాలని జాయింట్ కలెక్టర్ హన్మంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ మను చౌదరి, డీఆర్వో మధుసూదన్ నాయక్ లకు గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు.