పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు: మంత్రి హరీష్‌ రావు

200
harishrao

అత్యంత పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజవర్గస్థాయిలో రెండు పడక గదుల ఇండ్ల పురోగతి , కేటాయింపు పై ఇంజనీరింగ్, విద్యుత్, మిషన్ భగీరథ , రెవెన్యూ, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ అధికారులతో ఎంపీడీవో మీటింగ్ హాలులో మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌…దుబ్బాక నియోజకవర్గ పరిధిలో 25 గ్రామాలలో ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. నిర్మాణం పూర్తైన…రెండు పడక గదుల ఇండ్ల ను సాధ్యమైనంత త్వరగా లబ్దిదారుల కు అందించాలన్నారు. ప్రతి సైట్ లో విద్యుత్, త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని…ప్రతి సైట్ లో హరిత హరం లో భాగంగా మొక్కలు నాటాలన్నారు.