మొక్కలు నాటిన జబర్దస్త్ పవన్‌…

132
pawan

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు జబర్దస్త్ పవన్ ….రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని జబర్దస్త్ పవన్ అన్నారు.

పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూన్నానని తెలిపారు.

ఆర్టిస్ట్ పొట్టి విజయ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ యూసుఫ్ గూడ లోని తన నివాసంలో మొక్కలు నాటిన జబర్దస్త్ పవన్.. అనంతరం మరో ముగ్గురు
( జబర్దస్త్ టీంలోని ఫన్నీ , సత్య , సింగర్ స్వాతి ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.