ప్రణబ్‌కు ప్రముఖల నివాళులు..

176
pranab

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ పలువురు ప్రముఖలు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు నివాళులర్పించారు.

10 రాజాజీమార్గ్‌లోని ప్రణబ్‌ అధికారిక నివాసంలో ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలు ప్రణబ్‌ చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. త్రివిధ దళాల సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

సీపీఐ నాయ‌కుడు డి రాజా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డాతో పాటు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ప్ర‌ణ‌బ్‌కు నివాళుల‌ర్పించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తరపున మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు సీఎం అదనపు కార్యదర్శి అమరేందర్ రావు.