ప్రణబ్‌ మృతిపట్ల పుతిన్,జో బిడెన్ సంతాపం

227
puthin

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్,అమెరికా డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్‌. రాష్ట్రపతిగా ఇతర బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ స్వదేశంతోపాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించారని పేర్కొన్నారు పుతిన్. నిజమైన స్నేహితుడిగా రష్యా-భారత్‌ నడుమ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. భారత్‌ ఓ అద్భుత మేధావిని కోల్పోయిందన్నారు.

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్ర‌జాసేవ‌కుడు అని కొనియాడారు అమెరికా డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్. భార‌త్, అమెరికా దేశాలు క‌లిసి ప్ర‌పంచ స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌వ‌ని ప్ర‌ణ‌బ్ న‌మ్మేవారు….ఆయన మ‌ర‌ణ‌వార్త త‌న‌ను, త‌న భార్య జిల్‌ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింద‌ని బిడెన్ పేర్కొన్నారు.