ప్రణబ్ సవ్యసాచి..: సీఎం కేసీఆర్

81
cm kcr assembly

భారత ఆర్ధిక వ్యవస్థను అత్యున్నత స్ధాయిలో నిలబెట్టిన మహోన్నత వ్యక్తి ప్రణబ్ అన్నారు సీఎం కేసీఆర్. మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సీఎం…ప్రణబ్ సవ్యసాచి అని కొనియాడారు. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కొల్పోయిందని…క్రమశిక్షణ, కఠోర శ్రమ అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. ప‌్ర‌పంచంలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌గా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ‌కు స‌హాయ ప‌డిన వారిగా కాకుండా, రాష్ర్ట విభ‌జ‌న బిల్లుపై ముద్ర వేసి తెలంగాణ చ‌రిత్ర‌లో నిలిచిపోయాని తెలిపారు.

మిత్ర ప‌క్షాల‌ను క‌లుపుకుని పోవ‌డంలో విశ్వ‌స‌నీయుడిగా…ప్ర‌తిప‌క్షాల‌ను సిద్ధాంత‌పరంగా మాత్ర‌మే విమ‌ర్శించేవారని గుర్తుచేశారు సీఎం. జాతి నిర్మాణంలో ఆయ‌న అందించిన సేవ‌ల‌కు గుర్తింపుగా 2019లో భార‌త‌ర‌త్న అవార్డును బ‌హుక‌రించారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం తెలుపుతూ ఏక‌గ్రీవంగా తీర్మానిస్తుందన్నాని వెల్లడించారు.