సామాజిక న్యాయం టీఆర్ఎస్‌తోనే సాధ్యమని సీఎం కేసీఆర్ మరోసారి చూపించారని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. వరద బాధితుల సాయం కోసం రూ. 600 కోట్లు కేటాయించారని చెప్పారు.తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పల్లా…మరాఠ తదితర భాషలు మాట్లాడేవారికి 10 సీట్లు కేటాయించారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేతలు క్షేత్రస్ధాయిలో పర్యటించారని చెప్పారు.
బాధితులకు సాయం చేయకుండా కాంగ్రెస్,బీజేపీ అడ్డుకున్నాయని ఆరోపించారు. కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. వరదసాయం రూ.25 వేలు ఎలా ఇస్తారో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించాలని బీజేపీ బండి సంజయ్ చెబుతున్నారు….కానీ కేంద్రంలో ట్రాఫిక్ ఛాలన్లు పెంచింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాత చలాన్లనే అమలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలు నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలన్నారు.బీజేపీ ఎట్టి పరిస్ధితుల్లో వరద సాయం చేయలేదని..బురదమాత్రమే చల్లుతుందన్నారు పల్లా.
తాగి డ్రైవ్ చేయాలని బీజేపీ నేతలు చెప్పదలుచుకున్నారా అని ప్రశ్నించారు పల్లా. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఛలాన్లు అమలు చేయడం లేదా అని ప్రశ్నించిన పల్లా…ఇది బీజేపీ ద్వంద నీతికి నిదర్శనమన్నారు.