ఏపీలో బండి సంజయ్ ఎంట్రీ.. వ్యూహమా?

20
- Advertisement -

తెలంగాణలో బీజేపీ బలపడడంలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య పాత్ర పోషించారని స్వయంగా ఆ పార్టీ నేతలతో పాటు అధిష్టానం కూడా పదే పదే చెబుతూ ఉంటుంది. మరి అలాంటి నేతను ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి తప్పించి బీజేపీ అధిష్టానం పరపాటు చేసిందనే వాదన వినిపిస్తున్న వేళ ఆయనకు జాతీయ ప్రదాన కార్యదర్శి పదవి కట్టబెట్టి.. బండి సంజయ్ ని జాతీయ రాజకీయాల్లోకి తీసుకుంది అధిష్టానం. దీంతో బండి సంజయ్ విషయంల బీజేపీ అధిష్టానం ఏం చేయబోతుంది ? ఆయనను ఎలా వాడుకోబోతుంది ? అనే ప్రశ్నలు గత కొన్నాళ్లుగా వినిపిస్తూన్నాయి.

అయితే బండి సంజయ్ ని ఏపీ బీజేపీ తరుపున వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు ఆ మద్య వార్తలు వార్తలు బాగా వినిపించాయి. ఎందుకంటే తెలంగాణతో పోల్చితే ఏపీలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. అక్కడ ఇతర పార్టీల ( జనసేన ) నీడలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఏపీలో కూడా బీజేపీ బలపడాలంటే అక్కడ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే నాయకుల అవసరత చాలా ఉంది. అందుకే ఏపీ అధ్యక్ష పదవి విషయంలో సోము వీర్రాజు ను తప్పించి ఆ పదవిని పురందేశ్వరికి అప్పగించింది బీజేపీ అధిష్టానం.

ఇక పురందేశ్వరికి తోడు బండి సంజయ్ సేవలను కూడా ఏపీలో పార్టీకి వాడుకుంటే మరింత బలపడుతుందని కాషాయ పెద్దల ఆలోచనగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ ఏపీలో పర్యటించనున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బండి సంజయ్ ని అధిష్టానం ఏపీవైపు మల్లిస్తోందని. బండి సంజయ్ రాకతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎందుకంటే గతంలో జనసేనతో పొత్తు విషయంలో ఘాటుగా స్పందించిన బండి ఎప్పుడు పొత్తు అశంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తాజా పరిణామాలు చూస్తుంటే బండి సంజయ్ మెల్లగా ఏపీ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నాట్లు స్పష్టంగా అర్థమౌతోంది.

Also Read:అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్!

- Advertisement -