పీవీ స్మారక స్టాంపు కోసం రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ

57
cm kcr

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు సీఎం కేసీఆర్. మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు పేరిట స్టాంపును విడుదల చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 1921, జూన్ 28 వ తేదీన కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించిన పీవీ నరసింహ రావు శత జయంతి వేడుకలను తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని రాష్ట్రపతికి తెలిపారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు పీవీ స్మారక స్టాంపును విడుదల చేయాలని కోరారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో రామ్‌నాథ్‌కు లేఖరాసిన సీఎం…పీవీ స్మారక స్టాంపుకు త్వరగా అనుమతివ్వాలని కోరారు.