తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం

77
- Advertisement -

ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలు ఈనెల 27 వరకు జరగనున్నాయి.

ఈసారి సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ వెల్లడించిన నేపథ్యంలో అసెంబ్లీ సెషన్స్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:కిషన్ రెడ్డి దుష్ప్రచారం తగదు: ఎంపీ చామల

- Advertisement -