వేసవిలో ఇలా చేస్తేనే ఆరోగ్యం!

59
- Advertisement -

ఎండాకాలంలో ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన అనారోగ్య బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా మనం తినే ఆహారంలోనూ, అలాగే బయటకు వెళ్ళే టైమ్ లోనూ చాలానే జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా తినే ఆహారం త్వరగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తాజా ఆహారానే తీసుకోవాలి. ఇక నీటిని అధికంగా సేవించాలి. ఎక్కడికైనా బయటకు వెళ్ళే టైమ్ లో వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్ళడంతో పాటు ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు గొడుగు వెంటే ఉంచుకోవడం ఉత్తమం.

ఇక వేసవిలో చాలమంది శీతల పానీయాలు సేవించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే అధికంగా శీతల పానీయాలను సేవించడం కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇక వేసవిలో ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తేనే మంచిదట. ఎందుకంటే ఆల్కహాల్ లో శరీర ఉష్ణోగ్రతను పెంచే గుణాలు ఉంటాయి. దాంతో అటు ఎండ తీవ్రత.. ఇటు శరీర ఉష్ణోగ్రత పెరిగితే బాడీ త్వరగా డీహైడ్రేషన్ కు గురౌతుంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండడమే మంచిదని నిపుణుల అభిప్రాయం. ఇక వేసవిలో బిగుతూగా ఉండే దుస్తులు గాని, ముదురు రంగు దుస్తులు గాని ధరించడం అంత మంచిది కాదు.. ఎందుకంటే దుస్తులు బిగుతూగా ఉంటే శరీరం ఉక్కపోతకు గురై.. దురద, దద్దుర్లు వంటి సమస్యలకు దారి తీస్తుంది.

Also Read:సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడగింపు..

అందుకే వీలైనంత వరకు వదులుగా ఉండే దుస్తులను దరించడమే మంచిదట. ఇక బయటకు వెళ్ళేటప్పుడు వడగాలుల నుంచి తప్పించుకునేందుకు సన్ గ్లాసెస్ వాడడం మంచిది. ఎంతో అవసరం ఉంటేనే తప్పా తరచుగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయరాదు. ఇక ఇంట్లో కూడా ఇంటి యొక్క కిటికీలు తెరచి ఉంచితేనే మంచిది.. ఎందుకంటే కిటికీలు మూసి ఉంచడం వల్ల రూమ్ లో వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కిటికీలు తెరచి ఉంచాలి. ఇక వేసవిలో ఎక్కువగా గ్లూకోజ్, మరియు పండ్ల రసాలు అధికంగా సేవిస్తే.. బాడీలో రోగ నిరోధక శక్తి పెరిగి.. వేసవిలో వచ్చే వ్యాధులను ఎదుర్కోగలము. కాబట్టి వేసవిలో పైనా చెప్పిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:శశివదనే… ‘గోదారి అటు వైపో..’

- Advertisement -