ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ లేఖ..

40
kcr

ప్రధాని నరేంద్ర మోడీ,రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని లేఖ ద్వారా కోరారు సీఎం కేసీఆర్.

ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల నిర్వహణ జరుగుతుండగా ఇంగ్లీష్ మీడియంలో చదవని, హిందీ రాని వాళ్ళ వెసులుబాటు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.

యూపీఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్బీఐ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.