భారత్‌కు న్యూజిలాండ్ ప్రధాని లక్సన్..

11
- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మార్చి 16 నుండి మార్చి 20 వరకు అధికారికంగా భారతదేశాన్ని సందర్శించనున్నారు. న్యూజిలాండ్ ప్రధాని హోదాలో లక్సన్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని లక్సన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చర్చలు జరపనున్నారు.

ప్రధాని రైట్ హాన్ లక్సన్ మార్చి 17న భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, భారత్-న్యూజిలాండ్ సంబంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధాని మోదీ, అతిథి గౌరవార్థం భోజనం ఏర్పాటు చేయనున్నారు. అదే రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలవనున్నారు.

17న 10వ రైసినా డైలాగ్ 2025 ప్రారంభ సమావేశంలో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. మార్చి 19-20 తేదీల్లో ముంబయికి వెళ్లి, అక్కడ భారత వ్యాపార ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమవుతారు. లక్సన్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్‌కు వస్తోంది. లక్సన్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరచనుంది.

Also Read:మెగా ఇంటర్వ్యూ..చిరు కామెంట్స్!

- Advertisement -