ఈటల రాజేందర్‌పై మండిపడ్డ ఎమ్మెల్సీ పల్లా..

39
palla

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈటల ప్రయత్నాలు ఆత్మ‌గౌర‌వం కోసం కాదు.. ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మే అని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన పల్లా.. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న ఎంతో మందిని కేసీఆర్ నాయ‌కులుగా త‌యారు చేశారన్నారు.

అనామ‌కుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీఎం కేసీఆర్ స్పందించారంటే అది నియంతృత్వం కాదు ప్ర‌జాస్వామ్యం అని తెలిపారు. పార్టీలో ఉన్న‌ప్పుడు దేవుడు అన్నాడు.. బ‌య‌ట‌కు వెళ్లి నియంత‌, దెయ్యం అంటున్నారు. అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటే.. సూర్యుడిపై ఉమ్మేసిన‌ట్టే అన్నారు.

కేసీఆర్ వ‌ల్లే తెలంగాణ సాధ్య‌మైంద‌న్నారు. ఎంతో మంది టీఆర్ఎస్ లో చేరారు.. వెళ్లిపోయారు. బ‌య‌ట‌కు వెళ్తూ కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేశారని దుయ్యబట్టారు. ఈట‌ల కూడా అదే చేశారు. క‌న్న‌త‌ల్లి లాంటి పార్టీపై ఈట‌ల అభాండాలు వేశారన్నారు. హుజురాబాద్ ప్ర‌జ‌లంద‌రూ టీఆర్ఎస్ వైపే ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌పై నిజంగా ప్రేమ ఉంటే వారి భూములు ఎందుకు ఆక్ర‌మించారని ప్రశ్నించారు.