Palla:కొనుగోలు కేంద్రాల్లో దళారుల దోపిడే

9
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా దళారుల దోపిడీ నడుస్తోందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. వరి కొనుగోలు కేంద్రాలు సజావుగా సాగడం లేదని…ప్రైవేట్ దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. ముఖ్య మంత్రి హెచ్చరించిన తర్వాత వడ్ల ధర ముప్పయి రూపాయలు మాత్రమే పెంచారు..ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ పక్కన పెడితే ప్రస్తుతం 700 రూపాయలు తక్కువ ధరకు కొంటున్నారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వరికి 2500, మక్కలు 2200 కొంటామని హామీ ఇచ్చారు…సివిల్ సప్లై మంత్రి ఎక్కడ ఉన్నారు. ఒక్క రివ్యూ కూడా చేయరా ఆలోచించాలన్నారు. ఎన్నికల తర్వాత బోనస్ ఇస్తామని నమ్మబలుకుతున్నారు…ప్రభుత్వం మీద రైతులకు విశ్వాసం లేదు అన్నారు.మార్కెట్ లో అమ్మిన ప్రతి రైతుకు క్వింటాల్ కు 2200 రూపాయలు ఇవ్వాలి..వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎదో ఏర్పాటు చేశాం అంటే చేశారు తప్ప ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు లేవు అన్నారు.

మా ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేశాం..కొనుగోలు కేంద్రాల్లో అన్ని శాఖల అధికారుల సమన్వయం తో కొనుగోలు చేశాం అన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా పోతుంది…వరంగల్ డిక్లరేషన్ ఏమైంది…అనేక సభల్లో బోనస్ ఇస్తామని చెప్పారు ఏమైంది అని ప్రశ్నించారు.బోనస్ పక్కన పెడితే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

పండిన పంటకు గిట్టుబాటు లేక రైతులు మోసపోతున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేదు…రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందన్నారు. ప్రభుత్వం నిద్ర మేల్కొనాలి…రైతులతో రాజకీయాలు చేయొద్దు అని సూచించారు.

Also Read:వార్‌ 2..క్రేజీ అప్‌డేట్!

- Advertisement -