వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం: కేటీఆర్

35
covid

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశాన్ని వాక్సినేట్ చేయటమే మార్గం అన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచానికే వాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ఉందన్నారు. కేంద్రం కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల.. వాక్సిన్ మందకొడిగా సాగుతోందన్నారు. కేంద్రం ఇకనైనా సరయిన నిర్ణయాలు తీసుకోవాలి..కేంద్రం కొనాల్సిన సమయంలో వాక్సిన్ కొనలేదన్నారు.

కేంద్రం ప్రకటనలతో చేతులు దులుపుకుంది..రాష్ట్రంలో వాక్సినేషన్ విషయంలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు. హై రిస్క్ క్యాటగిరి కి వాక్సిన్ వేస్తున్నాం..ఇతర దేశాల నుంచి కేంద్రం వాక్సిన్ తెప్పించాలన్నారు. ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే ఖచ్చితత్వం వాక్సినేషన్ జరగాలి..రాష్ట్రాలకు కొనుగోలు చెయ్యాలని చూసినా, వాక్సిన్ దొరికేలా లేదన్నారు.

వాక్సినేషన్ కోసం కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలి..చాలా దేశాల్లో Astra zenica నిరుపయోగంగా ఉందన్నారు.దాన్ని తెప్పించుకోవచ్చు..ఫీవర్ సర్వేలో దేశానికే తెలంగాణ ఆదర్శం అన్నారు.150 icu పడకలను 15 కోట్ల రూపాయలతో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశాయన్నారు.లాక్ డౌన్ ముగిసే నాటికి కేసులు తగ్గొచ్చు..రాష్ట్ర ప్రభుత్వం కరోనా పట్ల అప్రమత్తంగా ఉందన్నారు. కరోనా విధుల్లో ఉన్న సిబ్బందికి అభినందనలు…మూడవ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.