హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..

33
Heavy Rain

హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. దీంతో న‌గ‌రమంతా చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. రాత్రంతా ఉక్క‌పోత‌తో బాధ‌ప‌డిన న‌గ‌ర ప్ర‌జ‌లు కాస్త చ‌ల‌బడ్డారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ, నాచారం, హ‌బ్సిగూడ‌, మ‌ల్లాపూర్‌, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్క‌డ‌ప‌ల్లి, రాంన‌గ‌ర్‌, విద్యాన‌గ‌ర్, క‌వాడిగూడ‌, భోల‌క్‌పూర్‌, హ‌కీంపేట‌, జీడిమెట్ల‌, షాపూర్‌న‌గ‌ర్‌, చింత‌ల్, సూరారంలో వ‌ర్షం కురిసింది. గ‌త రెండు, మూడు రోజుల నుంచి న‌గ‌రంలో ప‌లు చోట్ల వ‌ర్షం కురుస్తున్న విష‌యం తెలిసిందే.