రేవంత్ నోరు అదుపులో పెట్టుకో: గుత్తా

33
gutha

ఎంపీ రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని మండిపడ్డారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. టీడీపీని ముంచి కాంగ్రెస్ చేరిన రేవంత్….తన భజన బ్యాచ్‌తో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా….రేవంత్ వ్యవహార శైలీని తప్పుబట్టారు.

కాంగ్రెస్‌ షోకాల్డ్‌ లీడర్లు తెలంగాణ కోసం కొట్లాడలేదన్నారు. అధికారం రాలేదన్న బాధ తప్ప తెలంగాణ అభివృద్ధి మీద కాంగ్రెస్‌కు సోయి లేదన్నారు. కాంగ్రెస్‌ కల్లిబొల్లి మాటలను సాగర్‌ ప్రజలు నమ్మొద్దు అని సూచించారు.

నాగార్జున సాగర్‌ ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. సాగర్‌ అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎంతో కృషి చేశారని, ఆయన కుమారుడు నోముల భగత్‌ను ఆశీర్వదించాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.