కరోనా కల్లోలం…24 గంటల్లో 2 లక్షల కరోనా కేసులు

65
corona

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1,038 మంది మృతువాతపడ్డారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరగా ప్రస్తుతం దేశంలో 14,71,877 యాక్టివ్‌ కేసులున్నాయి. మృతుల సంఖ్య 1,73,123కు చేరగా ఇప్పటి వరకు 1,24,29,564 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. టీకా డ్రైవ్‌లో 11,44,93,238 డోసులు పంపిణీ చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది.