కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండగ

44
- Advertisement -

వ్యవసాయం అంటే దండగ అన్న స్థితి నుండి కేసీఆర్ నాయకత్వంలో పండగ చేసుకున్నాం అన్నారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రవీంద్రభారతిలో నిర్వహించిన తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్ జరుగగా పాల్గొన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. రైతుబంధు, రైతుభీమా, సాగునీళ్లు, కరంటు, పంటల కొనుగోళ్లతో రైతుకు అండగా నిలిచారు….రైతుకు వ్యవసాయం గురించి సమాచారం ఇవ్వడం అవసరం అన్నారు.

ప్రతి ఐదువేల ఎకరాలకు క్లస్టర్ ఏర్పాటు చేసి, రైతువేదిక నిర్మించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించిందన్నారు. భూసార పరీక్షలు చేసి రైతుల నేలలను బట్టి పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు…రైతుబడి డిజిటల్ మీడియా ద్వారా రాజేందర్ రెడ్డి రైతుల విజయాలను ఇతర రైతులకు తెలపడం బాగుందన్నారు. వ్యవసాయంలో తెలియనివి తెలుసుకోవాలి, తెలిసినవి ఇతరులకు తెలియజెప్పాలి…రైతుబడి ద్వారా రైతుల విజయాలు, ఇబ్బందులను బయటకు తీసుకు రావడం కోసం రాజేందర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.

వ్యవసాయంలో సొంతంగా కష్టం చేస్తేనే విజయవంతం కాగలుగుతాం…రైతుబడి భవిష్యత్ లో రాష్ట్ర రైతులకు మార్గదర్శిలా నిలవాలన్నారు. సమాచారం తెలుసుకుని దానిని ఆచరించేందుకు ప్రయత్నించాలన్నారు.

Also Read:బద్ధకం పోవాలంటే ఈ సూచనలు..

- Advertisement -