కరోనా నుండి కోలుకున్న సోమేశ్ కుమార్….

43
cs somesh kumar

కరోనా నుండి కోలుకున్నారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్. ఈ నెల 6న కరోనా బారీన పడ్డ సోమేశ్…తర్వాత హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఇక కరోనా నుండి కోలుకున్న సోమేశ్…ఇవాళ అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం కానున్నారు.

ఇక రాష్ట్రంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 3037 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 8 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరగా 1788 మంది కరోనాతో మృతిచెందారు. 3,08,396 మంది కరోనా నుండి కోలుకోగా 27,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.