తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొన్న మంత్రులు..

38
ministers

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం(నవంబర్ 20) నుంచి పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమైయ్యయి. మధ్యాహ్నం 1.21గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశించిన పిదప పుణ్య గడియలు మొదలవుతాయని పండితులు తెలిపారు. ఆలంపూర్ వద్ద మధ్యాహ్నం 1.23గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు స్థానికి ఎమ్మెల్యే అబ్రహం పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ 5వ శక్తి పీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభోత్సవంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

12 ఏళ్లకోసారి 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. భక్తుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద తాత్కాలిక బస్‌ షెల్టర్‌లను ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. గద్వాల జిల్లాలో నాలుగు ఘాట్లను ప్రభుత్వం పుష్కరాలకు సిద్దం చేసింది. వేణిసోంపురం ఘాట్‌,రాజోళి ఘాట్‌,పుల్లూరు ఘాట్‌,అలంపూర్‌ ఘాట్‌లను భక్తులను సందర్శించవచ్చు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే భక్తులను అనుమతిస్తారు. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, 65 ఏండ్ల పైబడిన వారికి అనుమతి లేదు. కరోనా నెగటి‌వ్‌ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కర ఘాట్‌లోకి అనుమతి ఉంటుందని టెస్టు రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ అనంతరం అనుమతి ఇవ్వనున్నట్లు దేవాదాయ శాఖ ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.