కూకట్పల్లి బీజేపీ ఆఫీస్‌ను ధ్వంసం చేసిన బీజేపీ నాయకులు…

94
bjp

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు బయట పడుతున్నాయి. పార్టీ ముఖ్యనేతల తీరుపై కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడితున్నా వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారంటూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పలువురు బీజేపీ నాయకులు కూకట్‌పల్లిలోని ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ చంద్ర రెడ్డి 30 లక్షలకు ఒక సీటు అమ్ముకొని 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులను పక్కన పెట్టిన ఆగ్రహంతో కూకట్పల్లి బీజేపీ ఆఫీస్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు కార్యకర్తలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు హరీశ్‌రెడ్డిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. కార్పొరేటర్‌ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.