విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: మంత్రి తలసాని

201
minister talasani
- Advertisement -

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని..క్రీడల్లో ప్రతిభ పంతులు ఎవరైనా ఉంటే వారిని ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం అమీర్‌పేట్‌లో లోని జిహెచ్ఎంసి గ్రౌండ్‌లో ఆరవ తలసాని యువసేన క్రికెట్ వార్షికోత్సవానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ టోర్నమెంట్లో సుమారుగా 80 టీమ్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక క్రికెట్ పైన బడ్జెట్ పెట్టకుండా వివిధ రంగాల్లో నైపుణ్యం కనపరిచిన క్రీడల్లో కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.

రాబోయే తరాల వారికి సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మెరుగైన క్రీడాకారులను అందించేందుకు తమ వంతు కృషి చేస్తానని మంత్రి తలసాని పేర్కొన్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కొద్దిసేపు క్రికెట్ ఆడి విద్యార్థులను అలరించారు. ఈ కార్యక్రమంలో తలసాని సాయికిరణ్ యాదవ్, సచిన్ రాథోడ్, మాజీ కార్పొరేటర్ శేషకుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -