ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి- సీపీ

18

తెలంగాణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంబర్ పేటలో కార్ హెడ్ క్వార్టర్స్‌లో హెల్త్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పాల్గొని హెల్త్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతు.. దేశవ్యాప్తంగా ఒమి క్రాన్ కేసులు నమోదవుతున్న తరుణంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాస్క్ లేకుండా తిరుగుతున్నా 1100 మందిపై కేసు నమోదు చేసాం.. కరోనా మహమరి ఇంకా తగ్గలేదు కాబట్టి ప్రజలు అప్రమతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్కు లు ధరించాలి భౌతిక ధర్మం పాటించాలి శానిటేషన్ వాడాలని కమిషనర్ కోరారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో రెండు వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అందరూ కోలుకున్నారని ఆయన అన్నారు.