న్యాక్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు- మంత్రి వేముల

66
- Advertisement -

శనివారం హైటెక్ సిటీలో న్యాక్ 42వ ఎక్స్క్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మావేశానికి ముఖ్య అతిథిగా రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,న్యాక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాక్‌లో పలు బ్లాక్ లను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. న్యాక్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యార్థులకు న్యాక్ కల్పిస్తున్న ఉద్యోగ నియామకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి.

అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు న్యాక్ అనే సంస్థ స్కిల్ డేవల్మెంట్ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. కోవిడ్ సమయంలో మా న్యాక్ పని చేసింది. 95 శాతం అచివ్ అయింది ఈ సందర్భంగా మా సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. పోయిన సంవత్సరం 19 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అలాగే ఈ సంవత్సరం 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నామని మంత్రి తెలిపారు.

నాన్ స్కిల్ వారికి ఒక రకమైన స్కిల్స్,స్కిల్స్ ఉన్న వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే భవన నిర్మాణ రంగంలో ఉండేలా ప్రోత్సహిస్తున్నాం. న్యాక్ ఆధ్వర్యంలో బిటెక్ చేసిన వారి కోసం ఒక్క సంవత్సరం పీజీ విద్యను అందించాలని నిర్ణయం తీసుకున్నాం. న్యాక్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు స్లాబ్ పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తాను.

ఈ సమావేశంలో కన్‌స్ర్టక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అందరు కోరారు. ముఖ్యమంత్రి కూడా న్యాక్‌లో కొత్తగా ఏర్పాటు చేసి యువతకు స్కిల్స్ పై శిక్షణ ఇవ్వాలని అంటుంటారు. ఈ యూనివర్సిటీకి సంబంధించి 3 సభ్యులతో కమిటీ వేశాం. కమిటీ రిపోర్ట్ వచ్చాక యూనివర్సిటీ ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -