భానుడి ప్రతాపం..అల్లాడుతున్న ప్రజలు

6
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి సెగలతో జనాలు అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో అయితే ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వడగాలుల కారణంగా త్వరగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్ళడం మంచిది. వేసవిలో దరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. వేసవిలో ప్రతిరోజూ రాగిజావా తాగడం ఎంతో మంచిది. రోజుకు రెండు సార్లు స్నానం, చేయడం ఎంతో మంచిది. ఎందుకంటే ఎండల కారణంగా శరీరం నుంచి విడుదలయ్యే చెమట కారణంగా దుర్వాసన, అలెర్జీ, దద్దుర్లు, చెమట కాయలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. వీటి నుంచి బయట పడేందుకు ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేస్తూ బాడీ లోషన్స్, సన్ క్రీం వంటివి శరీరానికి అప్లై చేయాలి.

Also Read:ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలు?

- Advertisement -