ఎమ్మెల్సీ కసిరెడ్డికి మంత్రి కొప్పుల శుభాకాంక్షలు..

25

మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి శనివారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది‌. ఈ సందర్భంగా శాసన మండలికి రెండవ సారి ఎన్నికైన కసిరెడ్డికి మంత్రి కొప్పుల పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అలాగే,ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న ఎల్.రమణలు కూడా నారాయణ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు.