ప్రతి గింజను కొనుగోలు చేస్తాంః మంత్రి నిరంజన్ రెడ్డి

372
Minister Niranjan Reddy
- Advertisement -

కరోనాకు అడ్డుకట్ట వేస్తునే వ్యవసాయ రంగాన్ని కాపాడుతామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సివిల్ సప్లై,మార్కెటింగ్, వ్యవసాయ శాఖకు సంబంధించిన శాఖ లపై రివ్యూ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. యాసంగిలో 39లక్షల ఎకరాలు సాగు అయినట్లు తెలిపారు. *యసంగి పంటల కొనుగోలు కు 18,000 కోట్లు కావాలని అంచనా ఉంది. .. కానీ 25 వేల కోట్లకు బ్యాంక్ రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఏ గ్రామం లో పండించిన పంటను ఆ గ్రామంలో నే అమ్ముకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కొనుగోలు సెంటర్ ల విషయంలో ఆంక్షలు లేవు..అవసారినికి తగ్గట్టు కొనుగోలు సెంటర్ లు ఏర్పాటు చేసుకోవచ్చు.కొనుగోలు సెంటర్ లలో తేమ మిషన్ లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం తీసుకు వచ్చేటప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకు వస్తే..ధాన్యం అమ్మిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో మీ అకౌంట్ లో డబ్బలు పడుతాయన్నారు. క్రిమిసంహారక మందులు అమ్ముకోవచ్చు.దేశ వ్యాప్తంగా పర్టీలైజర్ కు అనుమతి ఉంది. కూరగాయలు కొనే దగ్గరికి కుటుంబం నుండి ఒక్కరే రావాలి.ధరలు ఎక్కువ చెప్పారని వారి మీద దాడులు చేయకండి..మీకు అత్యవసర వస్తువులు లేకపోతే ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు.

- Advertisement -