పాలమూరు ఎత్తిపోతలపై విష ప్రచారం..

33
- Advertisement -

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాల విషప్రచారాన్ని ఖండించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని…ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయన్నారు.

దీనిని గమనించి కేసీఆర్ గారు 216 టీఎంసీల సామర్ద్యంగల శ్రీశైలం ప్రాజెక్టు నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నారని…వాళ్లు ముందు జూరాల నుండి మొదలుపెట్టాలి అని వాదించారు, తర్వాత అటవీ ప్రాంతం అని ఫిర్యాదులు పెట్టారు, తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది అని గ్రీన్ ట్రిబ్యునల్ లో విపక్షాలు ఫిర్యాదులు చేశాయని గుర్తుచేశారు. తర్వాత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు .. అనంతరం రైతుల పేరు మీద కేసులు వేయించారన్నారు. అన్ని విజ్ఞాలను దాటుకుని ప్రాజెక్టులో మొదటి పంపు ప్రారంభించగానే ఇప్పుడు ఒక పంపుతో ఎలా మొదలు పెడతారని కొత్త రాగం ఎత్తుకున్నారన్నారు.

జూరాల కింద ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 32 గ్రామాలు, 85 వేల ఎకరాల సేకరణ ఉందని..రీ డిజైన్ చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేవలం 27 వేల ఎకరాల భూసేకరణ, 3 పెద్ద గ్రామాలు, 8 చిన్నతండాలు మాత్రమే ఉన్నాయన్నారు. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం మీద కేసీఅర్ దృష్టిపెట్టారని…కృష్ణా నదిలో ఎక్కువ నీటి లభ్యత ఉన్నది తుంగభద్ర బేసిన్ ఉందన్నారు. శ్రీశైలం నుండి పాలమూరు రంగారెడ్డి చేపట్టడం మూలంగా ఈ నీరు కూడా అందుబాటులో ఉంటుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద వీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవని..పిల్లి శాపాలకు ఉట్లు తెగవన్నారు.

Also Read:ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతోంది:వికాస్ రాజ్

- Advertisement -