ఈ ఆసనం వేస్తే ఆ సమస్యలు దూరం!

33
- Advertisement -

నేటి రోజుల్లో చాలమందికి శారీరక శ్రమ తగ్గింది. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందువల్ల ప్రతిరోజూ వ్యాయామం లేదా యోగా చేయడం తప్పనిసరిగా మారింది. ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని నిపుణులు తరచూ చెబుతూ ఉంటారు. అయినప్పటికి యోగా చేయడంపై చాలమంది ఆసక్తి కనబరచారు. ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవాళ్ళు యోగా తప్పనిసరిగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు యోగా లోని కపోతాసనం గురించి తెలుసుకుందాం.. !

కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు పని చేసేవాళ్ళు కపోతాసనం తప్పనిసరిగా వేయాలి. ఈ కపోతాసనం వేయడం వల్ల వెన్ను సమస్యలు దూరం అవుతాయి. అంతే కాకుండా వెన్నెముకకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇక కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను కూడా దూరం చేసి కాలి కండరాలను శక్తివంతం చేస్తుంది. ఇంకా మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఫర్టీలిటీ సమస్యలను దూరం చేస్తుంది.

Also Read:Revanth:BJP..బ్రిటిష్ జనతా పార్టీ

కపోతాసనం వేయు విధానం

ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. ఆ తరువాత శ్వాసక్రియ నెమ్మదిగా జరిగిస్తూ.. తల నుంచి నడుము భాగం వరకు వెనుకకు వాల్చాలి. ఆ తరువాత తల మరియు మోచేతుల సహాయంతో నడుము భాగాన్ని ఫోటోలో చూపిన విధంగా వీలైనంతా పైకి లేపాలి. చేతులతో రెండు కాళ్ళ మేడిమలను పట్టుకొని తల మరియు మోచేతులపై శరీరభారం మోపాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడూ శ్వాసక్రియ నెమ్మదిగా జరిగించాలి.

జాగ్రత్తలు

ఈ ఆసనం మొదట్లో కాస్త కష్టతరంగానే అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువసార్లు సాధన చేయాలి. ఉబుసం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది.

 

- Advertisement -