వానాకాలం వరి పంటను కొంటాం: నిరంజన్ రెడ్డి

73
Minister Niranjan Reddy
- Advertisement -

వానాకాలం వరి పంటను కొంటాం కొంటామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్ర రైతాంగం కు విజ్ఞప్తి చేస్తున్న ఇప్పుడు ఉన్న కేంద్ర నమ్ముకుంటే నిండా మోసపోతాం అన్నారు. పేద ప్రజల,రైతుల ప్రయోజనాలు పెట్టకుండా ఉండేది ఈ కేంద్ర ప్రభుత్వం అన్నారు. మొన్న రైతులకు క్షమాపణ చెప్పింది పెదవులతో , హృదయం తో కాదన్నారు. యాసంగి వరి నష్టపోవద్దు అనేది మా ఆలోచన ,మా ప్రభుత్వ ఆలోచన ముందస్తుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్తూ వస్తున్నాం అన్నారు.

వానాకాలం వరి పంటను కొంటాం.యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలను వేసుకుందాం…ఇప్పటికే రైతు వేదిక ల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. మన దురదృష్టం ఏంది అంటే మన టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.

పార్లమెంట్ సాక్షిగా పీయూష్ గోయల్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు…కేంద్ర ప్రభుత్వం కొనుగోలు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తారు కానీ కొనాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రమేనన్నారు. బియ్యం ఎక్కడ పట్టించుకోవాలి ఎన్ని వడ్లకు ఎన్ని బియ్యం వస్తాయి అనేది ఎఫ్‌సీఐ కి మాత్రమే సంబంధం అన్నారు. రైస్ మిల్లర్లకు ఎన్ని బియ్యం ఇవ్వాలి రా రైస్ నా బాయిల్డ్ రైస్ నా అనేది కేంద్ర ప్రభుత్వం లోని ఎఫ్‌సీఐ కు సంబంధం ఉంటుందన్నారు.

మొత్తం సేకరించిన వడ్లలో అత్యధిక వడ్లు బాయిల్డ్ రైస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మేము బాయిల్డ్ రైస్ తీసుకోమ్ అంటే ఈ రాష్ట్రంలో పండించే మొత్తం రైస్ తీసుకోమని చెప్పినట్లేగా అని తెలిపారు. రాజకీయాల కోసం రైతులను,ప్రజలను మోసం చేస్తుంది ఈ బిజెపి అని దుయ్యబట్టారు.

- Advertisement -