గీతా గోశాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌..

40

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ఉదృతంగా ముందుకు సాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు చౌటుప్పల్ లోని గీతా గోశాలలో.. బాలకృష్ణ అఖండ సినిమాలో కనపడిన తెలంగాణ ఎడ్లు కృష్ణర్జునులు ఉన్న గోశాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గీతా గోశాల యజమాని శ్రీనివాస్ యాదవ్ మరియు వారి అమ్మ పార్వతమ్మతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.