పీఏ కుటుంబానికి అండగా మంత్రి కేటీఆర్..

43

తన పీఏ మహేందర్ రెడ్డి సోదరుడు అనారోగ్యంతో మరణించడంతో మంత్రి కేటీఆర్ ఈరోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులును పరామర్శించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్ద పీఏగా మహేందర్ రెడ్డి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇటీవల మహేందర్ రెడ్డి సోదరుడు అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మహేందర్ రెడ్డి సోదరుడి నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. పిల్లల భవిష్యత్తుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.