కాంగ్రెస్ ‘ కే‌టి‌ఆర్ ‘ స్థానాన్ని భర్తీ చేయగలదా?

43
- Advertisement -

ప్రస్తుతం ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రపథంలో దూసుకుపోతుంది. గత పదేళ్ళ కాలంలో హైదరబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన ఘనత బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ కే దక్కుతుంది. పెట్టుబడులను ఆకర్షించడంలోనూ సంపద సృష్టించడంలోనూ ఐటి మినిస్టర్ గా కే‌టి‌ఆర్ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. ప్రస్తుతం హైదరబాద్ ప్రపంచంలోనే మోస్ట్ డెవలప్డ్ సిటీగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక కే‌టి‌ఆర్ విజన్ మెయిన్ రీజన్. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం స్థాపించబోతున్న కాంగ్రెస్ కే‌టి‌ఆర్ స్థానాని భర్తీ చేయగలదా ? అనే సందేహాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. కాంగ్రెస్ లో సి‌ఎం పదవి కోసం రేస్ లో చాలమందే ఉన్నప్పటికి ఐటీ రంగాన్ని అభివృద్ది పథంలో నడిపించే ఐటీ శాఖకు ఆ పార్టీలో తగిన నేత ఎవరున్నారనేది ఆసక్తి రేపుతున్న ప్రశ్న.

ప్రపంచలోని బడా కంపెనీలను రాష్ట్రనికి ఆహ్వానించడం, సంపద సృష్టించడం, ఉద్యోగాలు కల్పించడం.. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ఆగ్రపథంలో నడిపించడం.. ఒక్క కే‌టి‌ఆర్ తోనే సాధ్యమైందనేది జగమెరిగిన సత్యం. మరి సి‌ఎం కుర్చీ కోసం కొట్లాడే కాంగ్రెస్ లో ఐటీ రంగాన్ని కే‌టి‌ఆర్ వలె ముందుకు నడిపించే నేత ఏ ఒక్కరూ లేరనేది తేటతెల్లమౌతోంది. దీంతో ముందు రోజుల్లో తెలంగాణలో ఐటీ హబ్ మసకబారనుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో ఐటీ రంగం నిమ్మదిస్తే సంపద సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం కష్టతరమౌతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలన ఐటీ రంగానికి సంబంధించి అత్యంత కలవర పెడుతున్న అంశం. మరి కే‌టి‌ఆర్ స్థానాన్ని హస్తం పార్టీ భర్తీ చేస్తుందా ? లేదా ఐటీని అభివృద్ది చేయడం తమవల్ల కాదని చేతులెత్తేస్తుందా ? అనేది చూడాలి.

Also Read:KTR:ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహిద్దాం

- Advertisement -