తెలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం..

46

తెలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టిస్‌లు నియామకమయ్యారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్ర శర్మ నియామకయ్యారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులకు ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. మరో 8 మందికి సీజేలుగా పదోన్నతి లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలను సుప్రీంకోర్టు కొలీజియం భర్తీ చేసింది. కొలీజియం విస్తృత సంప్రదింపుల తర్వాత న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఆమోదం తెలిపారు.

8 హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్‌ల నియామకం..

-తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ నియామకం.
-ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.
-అలహాబాద్ సీజేగా జస్టిస్ రాజేష్ బిందాల్.
-కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టీస్‌గా ప్రకాష్ శ్రీవాస్తవ.
-కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ ఆర్ అవస్థి.
-మేఘాలయ హైకోర్ట్ సిజేగా జస్టిస్ రంజిత్ వి మోర్.
-గుజరాత్ హైకోర్ట్ సిజేగా జస్టిస్ అరవింద్ కుమార్.
-మధ్యప్రదేశ్ హైకోర్ట్ సిజేగా జస్టిస్ ఆర్ వి మలిమత్ నియామితులైయ్యారు.