ఆకట్టుకుంటున్న ‘అన్నాత్తే’ సెకండ్ సింగిల్‌..

44
Annaatthe

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘అన్నాత్తే’. ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుండగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కుష్బూ, మీనా మరియు యంగ్ హీరో కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. వినాయక చవితి సందర్భంగా విడుదలైన… అన్నాత్తే ఫస్ట్ లుక్ అందరినీ అలరించింది. ఈ సినిమాను ‘దీపావళి’ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చురుకుగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల ఫస్టు సింగిల్‌ను విడుదల చేసిన చిత్రం బృందం.. తాజాగా సెకండ్ సింగిల్‌ను ఈరోజు రిలీజ్ చేసింది. రజనీ, నయన్‌లపై అందంగా చిత్రీకరించిన ఈ పాటను ఇమాన్ స్వరపరిచగా.. పాటకు యుగభారతి సాహిత్యాన్ని అందించారు. సిద్ శ్రీరామ్ – శ్రేయా ఘోషల్ ఈ పాటను ఆలపించారు. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్,జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేస్తుండటం, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా చేస్తోంది.

Saara Kaatrae -Lyric Video |Annaatthe |Rajinikanth |Sun Pictures | Imman| Sid Sriram| Shreya Ghoshal