దేశం గర్వపడేలా డబుల్ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం..

24
ktr

దేశం గర్వపడేలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు మంత్రి కేటీఆర్. ముషీరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన కేటీఆర్…పండుగ వాతావరణంలో ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరగడం సంతోషకరం అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మాజీ మంత్రి నాయిని ఆత్మ శాంతిస్తదన్నారు.

దేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నాం….రూ. 18 వేల కోట్లతో రాష్ట్రంలో 2 లక్షల 72 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. పేదవాడిపై రూపాయి కూడా భారం పడకుండా ఇళ్లు నిర్మించాం అన్నారు. మార్కెట్లో రూ. 40-50 లక్షలు పలికే ఇళ్లను పేదల కట్టిస్తున్నాం అన్నారు.

దేశంలో ఏ నగరంలో లేని విధంగా.. స్లమ్ ఫ్రీ నగరం కోసం కృషి చేస్తున్నామని తెలిపిన కేటీఆర్…పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా.. సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.ఒక్కో ఇంటిపై రూ 9 లక్షలు ఖర్చు చేసాం.. మీ పరిరాలను మీరే పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఇండ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి.. కిరాయికి ఇవ్వడం.. అమ్మడం లాంటివి చేయొద్దన్నారు. డిఫెన్స్ భూముల్లో పట్టాలు ఇప్పించేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు.

లంబాడీ తండా పేదలకు ఇళ్లు అందజేయడంతో ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడం సంతోషకరం అన్నారు.